![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -56 లో.. కార్తీక్ తండ్రి శ్రీధర్ తన లవర్ తో ఉండడం చూసిన విషయం దీప గుర్తుకుచేసుకుంటుంది. అప్పుడే సుమిత్ర వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావంటూ అడుగుతుంది. సమాజంలో నాలాంటి మోసపోయిన ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు ఎంత నమ్ముతామో అంతగా మోసం చేస్తున్నారని శ్రీధర్ ని దృష్టిలో పెట్టుకుని దీప మాట్లాడుతుంది. నువ్వేం అంటున్నావో నాకు అర్థం కావడం లేదని సుమిత్ర అంటుంది.
మీతో మీ ఆడపడుచు భర్త ఇలా చేస్తున్నాడని చెప్పాలని ఉంది కానీ చెప్పలేనని దీప మనసులో అనుకుంటుంది.. ఆ తర్వాత పిండం కాకులు ముట్టలేదు ఒకతను ఇలా అన్నాడంటూ జరిగిన విషయం దీప చెప్తుంది. ఏమో అతను చెప్పిన దాంట్లో నిజం ఉందేమో.. నీ తల్లితండ్రులు బ్రతికే ఉన్నారేమో నువ్వు పుట్టినప్పుడు ఏం జరిగిందో నీకు తెలియదు కదా అని సుమిత్ర అంటుంది. సుమిత్ర అలా అనగానే అనసూయ అన్న మాటలు గుర్తుకుచేసుకొని.. అత్తయ్య అన్నదానికి అతను అన్నదానికి ఏమైనా సంబంధం ఉందా అని దీప ఆలోచిస్తుంది. మరుసటి రోజు సుమిత్ర దగ్గరికి దీప వస్తుంది. నువ్వు ఉప్మా బాగా చేస్తావట కదా.. ఈ రోజు కాంచన వాళ్ళని టిఫిన్ కి పిలిచాను.. నువ్వు ఉప్మా చెయ్ అని సుమిత్ర అనగానే.. సరేనని దీప ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది. మరొకవైపు కార్తీక్ తన పేరెంట్స్ ని తీసుకొని.. సుమిత్ర ఇంటికి వస్తాడు. దీప వెళ్ళిపోయి ఉంటుంది. తనకి కూడా భయపడాల్సి వస్తుందని శ్రీధర్ అనుకుంటాడు.
నా చెల్లిని కలిసి వస్తానంటూ శ్రీధర్ కిచెన్ లో ఉన్న సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. అక్కడ దీపని చూసి షాకింగ్ గా ఇంకా వెళ్ళిపోలేదా అని అనుకుంటాడు. కంగారుగా కిచెన్ లో నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ వాటర్ కోసం కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ దీపని చూసి వెనక్కి వస్తుంటే.. ఎందుకు వెళ్ళిపోతాన్నారు.. నేను అన్న మాటలు గుర్తుకుచేసుకొని వెళ్లిపోవాల్సిన అవసరమేంటి? మనల్ని ఇలా చూసి వేరే వాళ్లకు అనుకునే ఛాన్స్ ఇవ్వొద్దు కదా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటారు. దశరథ్ ఏదో విషయం గురించి శ్రీధర్ తో మాట్లాడుతుంటే.. భార్య ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు ఆ నర్సింహా.. దీపకి అతనికి విడాకులు ఇప్పించండి.. మీ ఫ్రెండ్ కి చెప్పండి అన్నయ్య అని శ్రీధర్ కి సుమిత్ర చెప్తుంది. భార్య ఉండగా అలా చేస్తాడా అంటూ పారిజాతం తిడుతుంటే.. శ్రీధర్ టెన్షన్ పడతాడు. మళ్ళీ వస్తానంటూ అక్కడ నుండి శ్రీధర్ వెళ్ళిపోతాడు. అప్పుడే దీప దగ్గరికి శౌర్య వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |